హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుడికి పూజలు నిర్వహించిన ముస్లిం

NRPT: మరికల్ గ్రామం మత సమరసతకు ప్రతీకగా నిలిచింది. ఫ్రెండ్స్ వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన పంచముఖి వినాయకుడిని మరికల్ ఉప సర్పంచ్ ఖాజా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని, హిందూ-ముస్లింల ఐక్యతకు ఈ వేడుకలు నిదర్శనమని నిర్వాహకులు కొనియాడారు.