హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ వైద్యులు

BDK: పదునైన వస్తువుతో దాడికి గురైన 45 ఏళ్ల వ్యక్తికి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. శనివారం రాత్రి 11:30 గంటలకు తీవ్ర గాయాలతో వచ్చిన రోగికి ముఖం, మెడ, కుడి చెవి ప్రాంతాల్లో లోతైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. సీనియర్ రెసిడెంట్ డా. ఫరూక్, అనస్తీసియా డాక్టర్ రమేష్, స్టాఫ్ నర్సుల సాకారంతో ప్రాణం పోశారు.