హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌లో 33 అర్జీలు స్వీకరణ: మంత్రి సుభాష్

కోనసీమ: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవడమే ప్రజా దర్బార్ ఉద్దేశమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో 33 అర్జీలను స్వీకరించి, అర్జీదారుల సమస్యలను మంత్రి స్వయంగా విన్నారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.