హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో 629 మంది పోలీసుల పాసింగ్ ఔట్

కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌ మైదానంలో ఈనెల 26న 629 మంది ట్రైనీ పోలీసుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహించనున్నారు. బెటాలియన్‌లో 430, డీటీసీలో 199 మంది శిక్షణ పూర్తి చేశారు. కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్‌, డీఐజీ కోయ ప్రవీణ్‌ తదితరులు హాజరుకానున్నారు. ఏర్పాట్లపై కమాండెంట్‌ దీపికా పాటిల్‌ సమీక్షించారు.