హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి ఎక్స్‌ గ్రేషియా అందజేత

SKLM: విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కొత్తూరు మీ మెట్టూరు గ్రామానికి చెందిన ప్రకాశ్‌ రావు కుటుంబానికి విద్యుత్ శాఖ తరపున రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా మంజూరైంది. ఈ మేరకు మంజూరు పత్రాన్ని సోమవారం ఎమ్మెల్యే గోవిందరావు తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.