హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవనోపాధి కోసం వెళ్తూ వ్యక్తి మృతి

ELR: వట్లూరు సమీపంలో రైలు నుంచి జారిపడి ముంగర రాము (36) మృతి చెందాడు. జీవనోపాధి కోసం నెల్లూరు వెళ్తుండగా జనరల్ కోచ్ డోర్ వద్ద నుంచి ప్రమాదవశాత్తు జారిపడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉమెన్స్ కాలేజీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని ట్రాక్ మెన్ గుర్తించి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఏలూరు జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు.