హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భీమడోలులో పూర్తయిన పింఛన్ల పరిశీలన'

ELR: భీమడోలు మండలంలో నూతన పింఛన్ల దరఖాస్తుల పరిశీలన సోమవారంతో పూర్తయిందని ఎంపీడీవో పద్మావతి తెలిపారు. 404 వితంతు, 810 వృద్ధాప్య, 257 వికలాంగ, 240 మత్స్యకార, 8 చర్మకార, 8 కల్లుగీత, 22 డప్పు కళాకార పింఛన్లకు దరఖాస్తులు వచ్చాయన్నారు. పరిశీలన పూర్తి చేసిన జాబితాను 24న ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.