హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారం అప్పగించి నిజాయితీ చాటుకున్న యువకుడు

MNCL: బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలో సోమవారం 3 తులాల బంగారు పుస్తెలతాడు కిరణ్ అనే యువకుడికి దొరికింది. రోడ్డుపై పడిపోయి ఉన్న పుస్తెలతాడును తీసుకున్న ఆయన వెంటనే రూరల్ సీఐ హనుక్‌కు అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన కిరణ్‌ను స్థానికులు అభినందించారు. బంగారం పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ సూచించారు.