హైదరాబాద్: 28°C
తెలంగాణ

DPOకు మాజీ సర్పంచుల వినతి

SRD: ​వట్పల్లి మండలానికి చెందిన మాజీ సర్పంచులు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారిని కలిసి తమ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరారెడ్డితో పాటు సర్పంచ్ రాంచందర్, మాజీ సర్పంచులు బుద్ధిరెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.