హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి అభివృద్ధికి నిధులు మంజూరు

సత్యసాయి: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద పుట్టపర్తి పురపాలక సంఘంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. ఈ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. పుట్టపర్తి సాయి ఆరామం ఫంక్షన్ హాల్‌లోని ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్, అధికారులు పాల్గొంటారు.