VKB: సల్బత్తపూర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. టీచర్లు స్వరూప, ప్రమీల ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలయ్య, హెచ్‌ఎం తుకారాం, అయలు లక్ష్మి, గోరెమ్మ పాల్గొన్నారు.
తెలంగాణ
సమతుల్య ఆహారంపై అవగాహన


