హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

JGL: కోరుట్ల మండలం మోహన్‌రావుపేటలో లయన్స్ క్లబ్ ఆఫ్ అయిలాపూర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స అవసరమైన సుమారు 40 మందిని రేకుర్తి ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు దీకొండ రాజనర్సయ్యతో పాటు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.