RR: శంషాబాద్ పెద్ద షాపూర్ వద్ద ఎన్‌హెచ్-44పై లారీ నడిరోడ్డులో నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరు లైన్ల రహదారి పనులు నెమ్మదిగా సాగుతుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి, రద్దీ వేళల్లో ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉండాలని కోరారు.
తెలంగాణ
పెద్ద షాపూర్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్


