హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట నష్టపోయిన రైతులకు పరిహారం

VKB: తాండూరు మండలం సంగెంకలాన్‌లో గతేడాది అకాల వర్షాలతో రైల్వే ట్రాక్ సమీపంలో పంట నష్టపోయిన 57 మంది రైతులకు చిట్టినాడు సిమెంట్స్ ఆధ్వర్యంలో సుమారు రూ.14 లక్షల పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రైతులకు చెక్కులు అందజేశారు. రైతులకు అండగా ఉంటామని నేతలు తెలిపారు.