హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు తప్పనిసరి: కమిషనర్

E.G: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమాల్లో చిన్నారులను దూరంగా ఉంచి, విద్యుత్ లైన్లు, ట్రాఫిక్, శబ్ద కాలుష్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గజ ఈతగాళ్లు, క్రేన్ల సహాయంతో మాత్రమే నిమజ్జనం నిర్వహించాలన్నారు.