హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొత్త పెన్షన్లకు భారీగా దరఖాస్తులు'

CTR: పెనుమూరు మండలంలో కొత్తగా పెన్షన్ల మంజూరు కోసం సుమారు 1,400 దరఖాస్తులు వచ్చినట్లు ఇన్‌చార్జ్ ఎంపీడీవో ఢిల్లీబాబు తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పరిశీలన అనంతరం అర్హత ఉన్న వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని అధికారులు వెల్లడించారు. వీటిలో అత్యధికంగా వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.