హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే వేదికపై ఎమ్మెల్యే విజయశ్రీ - సతీష్ రెడ్డి

TPT: సూళ్లూరుపేటలో స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సన్నద్ధమవుతోంది. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ, సతీష్‌రెడ్డి పక్కపక్కన కనిపించడం చర్చకు దారితీసింది. ఛైర్మన్ పదవికి సతీష్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.