హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాగంటిలో వైభవంగా పల్లకి సేవ

NDL: యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఆలయ ఈఓ డి.పాండురంగారెడ్డి, చైర్మెన్ బండి మౌళీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా పల్లకిసేవ నిర్వహించారు. సాయంత్రం వేదపండితులు స్వామి అమ్మవార్లను ప్రత్యేక పల్లకిలో కొలువుంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ మాఢవీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు.