PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరంగా, పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ


