హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశువులు అడ్డురావడంతో లారీ బోల్తా

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ సోమవారం సాయంత్రం ఇచ్చోడలోని గాంధీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. పశువులు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా రావడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.