హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నారాయణపూర్‌కు న్యాయం జరిగేలా చూస్తాం'

KNR: నారాయణపూర్ రిజర్వాయర్‌ ప్రభావిత గ్రామస్తులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కలెక్టర్ చిత్రా మిశ్రాను కోరారు. సాధ్యం కాకపోతే ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు. సమస్యను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.