హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్షణపల్లిలో భూముల రీ-సర్వే ప్రారంభం: MRO

WGL: నల్లబెల్లి మండలంలోని అర్షణపల్లి గ్రామంలో భూముల రీ-సర్వే ప్రారంభమైంది. MRO ముప్పు కృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి మ్యాప్‌ల ప్రకారం కొలతలు చేపట్టారు. ఈ సర్వేతో భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్వే మల్లయ్య, రెవిన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.