హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి వినియోగంలో తాగునీటికి ప్రాధాన్యం: సంజీవ్ ముదిరాజ్

MBNR: జూరాల ప్రాజెక్టు నీటి విడుదల అంశంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ విమర్శించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అన్నారు. జూరాలలో నీటి లభ్యతను బట్టి సాగునీరు అందిస్తూనే, భవిష్యత్ తాగునీటి అవసరాలనుదృష్టిలో ఉంచుకుని నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తామని తెలిపారు.