KKD: గొల్లప్రోలు మున్సిపాలిటీలో 23 వార్డులకు తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. మొత్తం 20,846 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 10,376, మహిళలు 10,470 మంది ఉన్నారు. ఎస్టీ 46, ఎస్సీ 2,685, బీసీ 4,339, ఇతరులు 13,776 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2026 జనవరి 1 అర్హత తేదీగా జాబితా రూపొందించినట్లు కమిషనర్ దివిజ సంపతి మీడియాకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలు మున్సిపాలిటీలో 20,846 మంది ఓటర్లు


