హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో ఘనంగా శాంతి దినోత్సవం

W.G: అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా నరసాపురంలో పావురాలను ఎగురవేసి శాంతి సందేశాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సలహాదారు ఎంఏ షరీఫ్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొని మాట్లాడారు. శాంతి, సామరస్యం ఉన్నప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగాలని సూచించారు.