హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలుషిత నీరు.. విద్యార్థులు ఆవేదన

SRD: ​కంగ్టిలోని ST గురుకులంలో వంట నీటి సమస్య నెలకొంది. తాగునీరు ఫిల్టర్ ఉన్నప్పటికీ, వంటకు మాత్రం సంపులోని కలుషిత నీటినే వినియోగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. సంపులోని నీటిలో మలినాలు ఉంటుండటంతో ఆరోగ్యాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 500 మందికి పైగా విద్యార్థులున్న ఈ వసతి గృహంలో శుద్ధమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.