హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక.. ఛైర్‌పర్సన్ అభినందన

WGL: నర్సంపేటలోని ఈ నెల 17, 18, 19 తేదీల్లో గురజాల ఉన్నత పాఠశాలలో జరిగిన 70వ SGFI జోనల్ క్రీడోత్సవాల్లో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాల క్రీడాకారులు ప్రతిభ చూపారు. అండర్-14 కబడ్డీలో ప్రథమ స్థానం, అండర్-14 ఖో-ఖో బాలురు, బాలికలు, అండర్-17 బాలికల విభాగాల్లో ద్వితీయ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ అభినందించారు.