హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పౌష్టికాహారమే పునాది'

ATP: మంచి పోషకాహారంతోనే తల్లి, బిడ్డల ఆరోగ్యం సాధ్యమవుతుందని ఐసీడీఎస్ CDPO లలితమ్మ తెలిపారు. శింగనమల మండలంలోని నాగులగూడెం తండా అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసోత్సవ అవగాహన కార్యక్రమం సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహార ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.