హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోపాలపట్నం రైల్వే క్యాబిన్‌లో తనిఖీలు

VSP: గోపాలపట్నం ఈఐ క్యాబిన్‌, యార్డు, పాయింట్లను డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా రిజిస్టర్లు, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించి, రైళ్ల సురక్షిత రాకపోకలకు నిబంధనలు పాటించాలని సూచించారు. భద్రతా ప్రమాణాల అమలును పటిష్టం చేసేందుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.