AKP: గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధ చట్టం-1994ను కఠినంగా అమలు చేయాలని అడ్డ రోడ్డు ఆర్డీవో కే. రామలక్ష్మి ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో సోమవారం పీసీపీఎన్డీటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని, ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానా ఉంటుందని తెలిపారు. బాలికల లింగ నిష్పత్తి పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గర్భస్థ పిండ నిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి'


