హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన పాఠశాల

మన్యం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపులివలస ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నీట మునిగాయి. తరగతి గదుల్లోకి నీరు చేరడంతో సోమవారం విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. మధ్యాహ్న భోజన పథకానికి నిల్వ ఉంచిన బియ్యం తడిసిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.