హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో 100% 'ఈ-ఆఫీస్' అమలు కావాలి'

మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సోమవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా పరిపాలనలో 'ఈ-ఆఫీస్' (e-Office) నిర్వహణ తప్పనిసరి అని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. వివిధ శాఖల వారీగా ఫైళ్ల నిర్వహణను సమీక్షించారు.