RR: తలకొండపల్లిలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సాగునీటి సమస్యపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నా రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లను నిరంతరాయంగా నడపాలని, రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
తెలంగాణ
'జూరాల నుంచి సాగునీరు విడుదల చేయాలి'


