హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ కార్డుల ప్రాధాన్యతపై అవగాహన

RR: చీపునుంతల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ ఆశన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుమ్మడి రాజు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి రాములు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రాధాన్యతను వివరించారు.