హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కమిషనర్

ఖమ్మం రూరల్ మండలం వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సోమవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత మేరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై ఆరా తీశారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.