హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరి రైతులకు వ్యవసాయశాఖ సూచనలు

E.G: సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో వరి పొలాలను ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. మానుకొండ శ్రీనివాస్ పరిశీలించారు.  సాంబ మసూరి, కూనారం రకాలలో ఎర్రనల్లి, ఆకుముడత, పాముపొడ తెగుళ్లు ఉన్నట్లు గుర్తించారు. పూళ్ల, మారుటేరు రకాలలో ఎర్రనల్లి, పొటాషియం లోపం కనిపిస్తున్నట్లు తెలిపారు. రైతులు సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.