ASR: గిరిజన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని AISF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్రిష్ణ, కే.రాజశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం తలారిసింగి బాలుర హాస్టల్ ఎదుట నిరసన చేపట్టి, అనంతరం హాస్టల్‌ను సందర్శించారు. ఈనెల 30వరకు హాస్టళ్లను సందర్శించి, సమస్యలు తెలుసుకుంటామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
హాస్టల్ సమస్యలపై AISF పోరుబాట


