NLR: విడవలూరు మండలం పార్లపల్లిలో చెరువు పూర్తిగా గుర్రపుడెక్కతో నిండి అధ్వానంగా మారింది. రోడ్డు పక్కనే చెరువు ఉండడంతో ఇది చెరువా? లేక ఖాళీ స్థలమా? అనే అనుమానాలు వస్తున్నాయి. రోడ్డు వెంబడి వెళ్లే వాహనదారులు రాత్రి సమయాలలో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు గుర్రపు డెక్క తొలగించి, చెరువు వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నమ్మండి.. ఇది చెరువే..!


