CTR: వెదురుకుప్పం మండలం దేవళంపేట భక్తాంజనేయ స్వామి ఆలయ భూములను పరిరక్షించాలని హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు రామమూర్తి కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి తూర్పున ఉన్న స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. మురుగునీరు ఆలయ పరిసరాలకు చేరే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారులు స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ పరిసరాలకు మురుగునీటి ముప్పు


