VZM: అల్పపీడన ప్రభావం వలన రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. తర్వాత 24 గంటల్లో ఇది మరింత బలపడి శ్రీకాకుళం, విజయనగరం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వాయుగుండంగా అల్పపీడనం.. కలెక్టర్ అలర్ట్!


