VSP: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 450 వినతులు అందగా.. రెవెన్యూ 56, జీవీఎంసీ 108, పోలీస్ శాఖతోపాటు 31, ఇతర 255 వినతులు వచ్చాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
PGRS వినతులపై ప్రత్యేక శ్రద్ధ


