TPT: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్నత పదవుల నియామకాల్లో సామాజిక న్యాయం అమలు చేయాలని గిరిజన నవ సమాజ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ నాయుడు కోరారు. సోమవారం వీసీ నర్సింగరావును కలిసి వినతిపత్రం అందజేశారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా విద్యాసంస్థల్లో ఉన్నత పదవుల నియామకాల్లో సామాజిక న్యాయం అమలు కావడం లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సామాజిక న్యాయం అమలు చేయాలి'


