హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడిద రోడ్డుకి మోక్షం ఎప్పుడు?

కోనసీమ: మండపేట మండలం ఏడిద గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వరం శివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో గ్రామస్తులు, భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.