KRNL: ఓర్వకల్లు ఉప్పలపాడులో పొలంలో టమాటాలు కోస్తుండగా పిడుగు పడి మహబూబ్‌బీ (60), ముర్తుజాబీ (62) మృతి చెందారు. వదిన, మరదలైన ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళకు గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగు పడి ఇద్దరు మహిళల మృతి


