హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోషణ్ మాలో ఫుడ్ ఎగ్జిబిషన్

RR: రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం 9వ పోషణ్ మా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫుడ్ ఎగ్జిబిషన్, పోస్టర్ల ఆవిష్కరణ, ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్, మెడికల్ ఆఫీసర్, సీడీపీవో కవిత, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.