SKLM: పలాస నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. మూడు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, విద్యుత్ శాఖ డీఈతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ముందస్తు చర్యలను సమీక్షించారు. లోతట్టు, తీర, వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ ముప్పుపై ఎమ్మెల్యే సమీక్ష


