కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 92 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ విక్రాంత్ పాటిల్ బాధితుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, రుణాలు మంజూరు చేస్తామని మోసాలకు పాల్పడిన వారిపై పలువురు ఫిర్యాదు చేశారు. అన్ని ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్‌ఎస్‌కు 92 ఫిర్యాదులు


