AKP: నాతవరం (మం) పీ.జగ్గంపేటలో కోడిపందేలు నిర్వహిస్తున్న ప్రదేశంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వై.తారకేశ్వరరావు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ.1,150 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చట్టవిరుద్ధంగా కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కోడిపందాలపై దాడులు


