హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీసేవ కేంద్రాల్లో అధిక వసూళ్లు

CTR: మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన సేవా రుసుము కంటే అధికంగా వసూలు చేస్తున్నారని పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆర్డీఓ భవానీకి ఫిర్యాదు చేశారు. ప్రతి మీసేవ కేంద్రంలో వివిధ సేవలకు నిర్ణయించిన రుసుముల పట్టికను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.