హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ నిర్మాణాలపై పురపాలక చర్యలు

RR: ఎల్‌బీనగర్ సర్కిల్-13 పరిధిలోని కర్మన్‌ఘాట్, హనుమాన్‌నగర్‌లో పురపాలక అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం ఈ చర్యలు చేపట్టింది. మున్సిపల్ నిబంధనల అమలు, ప్రజోపయోగ స్థలాల పరిరక్షణలో భాగంగానే కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.